పాట రికార్డ్ చేసి పంపండి

మీ అమ్మమ్మ, నానమ్మ, అత్త లేదా ఊళ్ళో ఎవరైనా పెద్దవారు బతుకమ్మ పాటలు పాడతారా? వారు పాడుతుండగా మీ ఫోన్‌తో రికార్డ్ చేయండి — ఆడియో అయినా, వీడియో అయినా సరే.

రికార్డింగ్ మొదట్లో ఇవి చెప్పించండి

పాట మొదలుపెట్టే ముందు, రికార్డింగ్‌లోనే ఈ వివరాలు మాటల్లో చెప్పాలి:

  1. పాడేవారి పేరు, ఊరు — ఉదా: "నా పేరు లక్ష్మమ్మ, మాది ధర్మారం."
  2. ఈ పాట ఎక్కడ, ఎవరి దగ్గర నేర్చుకున్నారు — ఉదా: "మా అమ్మ దగ్గర నేర్చుకున్నా."
  3. రికార్డ్ చేస్తున్నవారి పేరు — మీరు మీ పేరు చెప్పండి.
  4. పాడేవారి అనుమతి — వారు స్వయంగా ఇలా చెప్పాలి: "ఈ పాటను బతుకమ్మ వెబ్‌సైట్‌లో అందరూ వినేలా పెట్టడానికి నాకు ఇష్టమే."

మంచి రికార్డింగ్ కోసం

ఎలా పంపాలి

రికార్డింగ్‌ను hello@bathukamma.org కు ఈమెయిల్ చేయండి. ఫైల్ పెద్దదైతే Google Drive లింక్ పంపండి. ఈమెయిల్‌లో పాట మొదటి వరుస, జిల్లా, రికార్డ్ చేసిన సంవత్సరం కూడా రాయండి.

Record a song and send it to us

Does your grandmother, aunt, or an elder in your village sing Bathukamma songs? Record them singing on your phone. Audio or video is fine.

Say these at the start of the recording

Before the song begins, these details should be spoken in the recording itself:

  1. The singer's name and village, e.g. "My name is Lakshmamma, I am from Dharmaram."
  2. Where, and from whom, they learnt the song, e.g. "I learnt it from my mother."
  3. Who is recording: say your own name.
  4. The singer's consent: in their own words, e.g. "I am happy for this song to be published on the Bathukamma website for everyone to hear."

Tips for a good recording

How to send it

Email the recording to hello@bathukamma.org. If the file is large, send a Google Drive link. Please include the song's first line, the district, and the year it was recorded.

hello@bathukamma.org కు పంపండిEmail hello@bathukamma.org